వైరల్: 139 సంవత్సరాల ఇంటిని వదులుకోలేక... ఆ వ్యక్తి... 

వైరల్: 139 సంవత్సరాల ఇంటిని వదులుకోలేక... ఆ వ్యక్తి... 

సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఎవరికైనా కల ఉంటుంది.  సొంతంగా ఇంటిని నిర్మించుకున్నాక దాన్ని అపురూపంగా చూసుకుంటారు.  అయితే, వేరే ప్రాంతానికి వెళ్లే సమయంలో మనం వెళ్లినా, ఇంటిని మనతో తీసుకువెళ్ళలేము.  కానీ, ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు.  139 సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ ఇంటిని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు.  ఆ ఇంటిని చాలా అపురూపంగా చూసుకున్నాడు.  అయితే, అమ్మడి నుంచి మరొక చోటకి వెళ్ళాలి అనుకున్నాడు.  తాను ఉంటున్న ఇంటిని వదిలి ఉండలేక, ఇంటిని అక్కడే వదిలేయలేక వినూత్నంగా అలోచించి, ఇంటిని కూడా అక్కడి నుంచి తరలించాడు.  నూతన టెక్నాలజీని వినియోగించి ఇంటిని పునాదులతో సహా అక్కడి నుంచి తరలించారు.  పాత ఇల్లు ఉన్న ప్రాంతం నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతానికి ఆ ఇంటిని తరలించాడు.  అర కిలోమీటర్ ఇంటిని తరలించేందుకు అయన రూ.2.9 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు.  ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగింది.