వంటింట్లో మెగా, అక్కినేని కోడళ్లు

వంటింట్లో మెగా, అక్కినేని కోడళ్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  సతీమణి ఉపాసన  మెగా కోడలుగానే కాకుండా ఎనో సేవ కార్యక్రమాలు చేస్తూ  ప్రజల ఆదరణ పొందుతున్నారు. అలాగే బిజినెస్ లలోను ఆమె ముందుంది. ఒక నిజమైన ఫెమినిస్ట్ గా, ఒక సామాజిక కార్యకర్తగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అక్కినేని  కోడలు సమంత కూడా అదే బాటలో పయనిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ వుమెన్ గా, సామాజిక కార్యకర్తగా కూడా మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటుంది. తాజాగా ఉపాసన, సమంతతో కలిసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడానికి "యువర్‌ లైఫ్‌ " అనే వెబ్‌సైట్‌ను స్టార్ట్ చేశారు. ఈ వేదిక లక్ష్యం ట్రెండింగ్ ఆరోగ్య చిట్కాలు.. పోషణ... ఆహార ప్రణాళికలు.. జీవనశైలి వగైరా వ్యవహారాలపై విలువైన విషయాల్ని అభిమానులకు షేర్ చేయనున్నారు. తనలోని వంట నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఓ వీడియోతో ముందుకు వచ్చారు అక్కినేని కోడలు. ఉపసానతో కలిసి ‘తక్కలి సడం’ అనే తమిళ వంటకం వండడం కనిపిస్తోంది. ఇందుకు ఉపయోగించే పదార్థాలు.. రెసిపీని ఈ వీడియోలో చూపించారు. సమంత బ్రౌన్‌ రైస్‌తో టమాటో రైస్‌ ని ఎలా చేయాలి అని తయారీని తెలియజేశారు. తాను ప్రతిరోజూ వైట్‌ రైస్ బదులు బ్రౌన్‌ రైస్‌ను తింటానని సమంత తెలిపారు. బ్రౌన్‌ రైస్‌తో చేసిన టమాటో రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సమంత తెలిపారు.