జూన్ ప్రథమార్ధంలో సమంత 'ద ఫ్యామిలీ మ్యాన్2'

జూన్ ప్రథమార్ధంలో సమంత 'ద ఫ్యామిలీ మ్యాన్2'

సమంత తొలి వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో సంచలన విజయం సాధించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించింది. ఈ సీరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సమంత నటించటంతో దక్షిణాదిలో ఈ వెబ్ సీరీస్ కి క్రేజ్ రెట్టింపు అయిందనే చెప్పాలి. నిజానికి ఈ సీరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడో అవుతుందని భావించారు. అయితే రీషూట్ వల్లో మరే కారణం వల్లో ఆలస్యం అయింది. ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కు తేదీ కూడా ప్రకటించారు. అయినా కాలేదు. ఆ తర్వాత అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. చివరికి జూన్ ప్రథమార్ధంలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారట. ఇందులో పాకిస్థానీ ఉగ్రవాదిగా కనిపించనుంది సమంత. సమంత బర్త్ డే స్పెషల్ గా ఈ సీరీస్ నుంచి ఆమె ఫోటోను విడుదల చేశారు. సింపుల్ గా ఆకట్టుకునేలా ఉందా లుక్. ఈ సీరీస్ ను తెలుగువారైన రాజ్, డీకే ద్వయం రూపొందించటం విశేషం.