రెమ్యునరేషన్ తగ్గించిన సమంత...

రెమ్యునరేషన్ తగ్గించిన సమంత...

గత కొద్దిరోజులుగా సమంత తమిళంలో ఓ సినిమా చేయబోతుంది అందులో మరో హీరోయిన్ గా నయనతార కూడా నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు టాప్ హీరోయిన్లు కలిసి నటించడం నిజమేనట! అంతే కాదు ఈ సినిమాలొ నటించడానికి సమంత తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందట..! ఎందుకంటే... కరోనా కారణంగా నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ ను ఆదుకోవడంకోసమే తాను ఈ పని చేసింది అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తున్న కారణంగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. ఇక దర్శకుడు విగ్నేష్ శివన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఏడాది సమంత జాను సినిమాతో అభిమానులను ఆకట్టుకుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.