పాండ్యా కొడుకును ఎత్తుకున్న ధోని కూతురు...

పాండ్యా కొడుకును ఎత్తుకున్న ధోని కూతురు...

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొడుకు జూనియర్ పాండ్యా ఈ ప్రపంచం లోకి వచ్చిన విషయం తెలిసిందే. పాండ్యా కు కాబోయే భార్య సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ జూలై 30 న ఆసుపత్రిలో పండంటి అబ్బాయికి జన్మనివ్వడంతో  హార్దిక్ , స్టాంకోవిక్ మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు. అయితే తాజాగా పాండ్యా కొడుకు భారత మాజీ కెప్టెన్ ధోని కూతురు జీవా చేతిలో ఉన్నాడు. ధోని భార్య సాక్షి తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. అందులో జీవా కూర్చొని ఉంటె తన చేతుల్లో ఓ బాబు ఉన్నాడు. అయితే ఆ బాబు పాండ్యా కొడుకే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంటే ధోని భార్య, కూతురు ఇద్దరు పాండ్యా కొడుకు చూడటానికి వెళ్ళారన్నమాట. అయితే ధోని కూడా వెళ్లాడా లేదా అనేది తెలియదు. కానీ ఈ రోజు ధోని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు  చేసిన శిక్షణ శిబిరం లో పాల్గొనడానికి చెన్నై వచ్చాడు. ఇక పాండ్యా కూడా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో రాణించడానికి చాలా కష్టపడుతున్నాడు.