సీఎం జగన్ మరో జ్యోతిరావు పూలే.. మరో అంబేద్కర్

సీఎం జగన్ మరో జ్యోతిరావు పూలే.. మరో అంబేద్కర్

జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సమసమాజం నిర్మాణం కోసం సీఎం జగన్‌ పలు సంస్కరణలు తీసుకువస్తున్నారని మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరింత నిర్మాణాత్మకంగా బీసీల అభ్యున్నతికి పునరంకితమవుతామని తెలిపారు. ఈ ఏడాదిన్నర కాలంలో బీసీలను బ్యాక్ బోన్‌ కులాలుగా మార్చామని పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా బీసీల అభ్సున్నతి కోసం జగన్ సర్కార్ కృషి చేస్తోంది. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ అన్నారు. నామినేటెడ్ పదవులు.. పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. కాంట్రాక్టుల్లోనూ బీసీలకే పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడారు. బడుగుల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే కృషి చేశారని తెలిపారు.సీఎం జగన్ మరో జ్యోతిరావు పూలే.. మరో అంబేద్కర్ అని కొనియడారు.