సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్... 

సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్... 

ఒలింపిక్ కాంస్య పతక విజేత, మాజీ ప్రపంచ నంబర్ 1 సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే థాయిలాండ్ ఓపెన్‌ 2021 పాల్గొనేందుకు వెళ్లిన సైనా నెహ్వాల్ అలాగే మరో ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కరోనా బారిన పడ్డారు. ఈ టోర్నీ ముందు నిర్వహించాల్సిన మూడు కరోనా పరీక్షలో... మొదటి రెండిట్లో కరోనా నెగెటివ్ గా వచ్చిన తాజాగా ఈరోజు నిర్వహించిన మూడో కరోనా టెస్ట్ లో మాత్రం వీరిద్దరికి పాజిటివ్ గా వచ్చింది. అయితే ఈ నెల ఆరంభంలో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, పివి సింధు మరియు సాయి ప్రణీత్ లతో పాటుగా టాప్ ఇండియా షట్లర్లు ఈటోర్నీ కోసం థాయ్‌లాండ్‌ కు వెళ్లారు.