రిపోర్ట్ లో గందరగోళం... సైనా నెహ్వాల్ కు కరోనా నెగెటివ్

రిపోర్ట్ లో గందరగోళం... సైనా నెహ్వాల్ కు కరోనా నెగెటివ్

మాజీ ప్రపంచ నంబర్ 1 సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్ ఓపెన్ 2021 లో పాల్గొనేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీ కి ముందు చేసిన కరోనా పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిన్న ప్రకటించారు. అయితే ఈటోర్నీకి వెళ్లిన సైనా తన భర్త సహచర ఆటగాడు అయిన పారుపల్లి కశ్యప్ తో కలిసి ఒకే గదిలో ఉండటంతో అతడిని కూడా క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ తాజా సమాచారం ప్రకారం సైనా నెహ్వాల్ కు కరోనా లేదని రిపోర్ట్ లో గందరగోళం జరిగింది అని బిడబ్ల్యుఎఫ్ ప్రకటించింది. నెహ్వాల్ తో పాటుగా కరోనా పాజిటివ్ గా పరీక్షించబడిన మరో ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా కరోనా సోకలేదని తెలిపింది. దాంతో సైనా, కశ్యప్,  ప్రణయ్ తిరిగి థాయ్‌లాండ్ ఓపెన్ లో పాల్గొననున్నారు. నిన్న రద్దు చేసిన వీరి మ్యాచ్ లను ఈరోజు నిర్వహించనున్నారు.