సైనా బయోపిక్ తో ఈ అమ్మడి కెరియర్ షైన్ అవుతుందా ..?

సైనా బయోపిక్ తో ఈ అమ్మడి కెరియర్ షైన్ అవుతుందా ..?

ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్రతో సినిమాలు తెరకెక్కడం ట్రెండ్ అయింది. అలా తెరకెక్కిన సినిమాలు అన్ని బంపర్ హిట్ అవ్వడమే అందుకు కారణం. కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగాట్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, బాక్సర్ మేరీకోమ్, స్ప్రింటర్ మిల్కా సింగ్ వంటి సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ‌ ప్రధాన పాత్రలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ గా కనిపించడానికి పరిణీతి చోప్రా శిక్షణ తీసుకుంటుంది. ఈ సినిమా పరిణితి కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుందని చిత్రయూనిట్ చెప్తుంది. రోచక్ కోహ్లీ- అమాల్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అమాల్ మాలిక్ పరీణీతి సైనా ప్రీలుక్ స్క్రీన్ షాట్ ని షేర్ చేసాడు. ఈ సినిమాకు సంబంధించిన మ్యాజిక్ చేస్తున్నామని ఈ మ్యూజిక్ హైలైట్ గా వుండబోతోందని.. మనోజ్ ముంతాషిర్ అద్భుతమైన లిరిక్స్ ఇస్తే శ్రేయాస్ ఘోషల్ అంతే అద్భుతంగా పాడిందని  చెప్పుకొచ్చాడు . ఆలాగే పరిణీతి చోప్రా పెర్ఫార్మెన్స్ కి వంద మార్కులు పడతాయని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ని రిట్వీట్ చేసిన పరిణీతి చాలా నెర్వస్ గా వుందని రిప్లే ఇచ్చింది.