ప్రైవేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం కాపలా కాస్తోంది...

ప్రైవేట్ సంస్థలకు  మోడీ ప్రభుత్వం కాపలా కాస్తోంది...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మరోసారి బీజేపీ పార్టీపై ఫైర్‌ అయ్యారు. మోడీ ఏడేళ్ల పాలనలో దేశ ప్రధానులు అమ్మినదానికంటే డబుల్ అమ్మారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  వేలకోట్ల అప్పులు ఎగగొట్టిన ప్రైవేట్ సంస్థలకు  మోడీ ప్రభుత్వం కాపలా కాస్తోందని ఆరోపించారు. గుజరాతీలకు ఒక రేటు...ఆంధ్రుల హక్కు అన్న విశాఖ ఉక్కుకు ఒక రేటు అంట అని నిప్పులు చెరిగారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి పూర్తిస్థాయి స్పష్టత బీజేపీ నేతలకు లేదని... మొన్నటి వరకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని.. ఇప్పుడు లేదు అని మాట మార్చారని ఫైర్‌ అయ్యారు.  ఫ్యాషన్ షో ఫోజులు ఇచ్చినట్లు... మోడీ ఫోటోల్లో ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.  బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో లేవన్నారు.