సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ పూర్తి
ఈమధ్య టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘రిపబ్లిక్’. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న 'రిపబ్లిక్' పై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. తాజాగా ‘రిపబ్లిక్’ సినిమా కంప్లీట్ అయిందంటూ చిత్రబృందం ఫోటో పంచుకుంది.. 64 రోజుల్లో ఎలాంటి కొవిడ్ కేసులు లేకుండా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశామని దేవా కట్ట తెలిపారు. సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘రిపబ్లిక్’ టీమ్ అందరి కృషి వల్లే ఇంత త్వరగా షూటింగ్ పూర్తయింది. చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. నా కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)