ఫిదా బ్యూటీ డిమాండ్ కు నిర్మాతలు షాక్

ఫిదా బ్యూటీ డిమాండ్ కు నిర్మాతలు షాక్

ఫిదా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమాలో తన నటనతో అందరిని ఫిదా చేసింది పల్లవి. ఆ సినిమా తరవాత తెలుగులో మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక సాయిపల్లవి ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది.మొదటి సినిమా నుంచి తన అద్భుత డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోన్న ఈ బ్యూటీ.రానా మూవీ తర్వాత నాని నెక్స్ట్ మూవీ `శ్యామ్ సింఘరాయ్`లో నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయట. ఇప్పటికే స్క్రిప్టు వినేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సాయిపల్లవి రేంజ్ పెరిగింది. ఈ అమ్మడు సినిమా ఒప్పుకోవాలంటే ఆ సినిమా తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి, గ్లామర్ షో ఉండకూడదు  ఇలా చాలానే ఉన్నాయట . పైగా అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది. ఒక్కొక్క సినిమాకు సాయి పల్లవి 2 కోట్లవరకు డిమాండ్ చేస్తుందట. పల్లవిపాప ఆ రేంజ్ లో డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఇక శ్యామ్ సింఘరాయ్  చిత్రం విషయానికొస్తే రాహుల్ సంకృతన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు వారిలో సాయి పల్లవి ఒకరు.