పెళ్లిమీద పెద్దగా ఇంట్రస్ట్ లేదంటున్న మెగా హీరో

పెళ్లిమీద పెద్దగా ఇంట్రస్ట్ లేదంటున్న మెగా హీరో

మెగా కాంపాండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు  సాయి ధరమ్ తేజ్. ఈ యంగ్ వరుస ఫ్లాపులు పలకరించిన తర్వాత ఇప్పడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చిత్రలహరి సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన తేజ్ ప్రతి రోజు పండగే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. త్వరలో సోలోబ్రతుకే సో బెటర్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల బర్త్ డే విషెస్ చెబుతూ సాయితేజ్ పెళ్లి గురించి మెగాస్టార్ చిరంజీవి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సాయితేజ్ సోలో డేస్ త్వరలో ముగియబోతున్నాయని చిరంజీవి ట్వీట్ చేశారు. తేజ్ కూడా ఓ ఇంటివాడు అవ్వాలని డిసైడ్ అయ్యాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.కానీ ఊహించని షాక్ ఇచ్చాడు ఈ మెగా హీరో . తాజాగా ఎన్టీవీ తో మాట్లాడుతూ పెళ్లి గురించి పెద్ద గా ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు తేజ్ . ''ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తుంటే సంబంధాలు చూడమని మాత్రం చెప్పాను. అంతకుమించి నా పెళ్లిపై ఏదీ ముందుకు జరగలేదు. ఇంట్లో వాళ్ళు పెళ్ళిచేయాలని ఫిక్స్ అయ్యారు. అమ్మాయి బాగా నచ్చితే ఇంట్లో వాళ్లంతా  ఓకే  అంటే చేసుకుంటా తప్పా పెళ్లి మీద ప్రత్యేకంగా ఇంట్రస్ట్ అయితే లేదు అంటూ చెప్పుకొచ్చాడు తేజ్ .