సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు

సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు

విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి వాటినుంచి తప్పించుకొనేందుకు ముస్లిం మహిళ లు హిందూమతంలో చేరాలని దీని ద్వారా బాలికలు వేధింపుల నుంచి బయటపడవచ్చన్నారు. హిందూ పురుషులను పెండ్లి చేసుకోవాలన్నారు. మధురలోని బంకే బిహారి దేవాలయంలో పూజలు చేసిన ప్రాచీ అనంతరం మీడియాతో మాట్లాడారు. బరేలీ వాసి నిదా ఖాన్‌తోపాటు ము స్లిం మహిళలతో భేటీ అయి హిందుత్వాన్ని స్వీకరించాలని కోరుతానన్నా రు.

హమీర్‌పూర్ ఆలయాన్ని మహిళా ఎమ్మెల్యే సందర్శించిన తర్వాత గంగా జలంతో శుద్ధి చేయడం మహిళల పట్ల అన్యాయమన్నారు. మహిళ బిడ్డకు జన్మనివ్వవచ్చని, కాని మహిళలు మాత్రం దేవాలయంలో పూజలు చేయడానికి అనుమతించరా అని సాధ్వీ ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం రాజకీయ అంశం కాదని, దేవాలయం ద్వార రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం తగదన్నారు.