టీడీపీకి గుడ్‌బై.. సాధినేని యామిని చేరేది ఏ పార్టీలో..?

టీడీపీకి గుడ్‌బై.. సాధినేని యామిని చేరేది ఏ పార్టీలో..?

సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని పరాజయం చవిచూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు.. బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోగా.. తాజాగా టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు సాధినేని యామిని.. ఈ మేరకు పార్టీక అధినేత చంద్రబాబు నాయుడుకు ఆమె రాజీనామా లేఖ రాశారు. తన లేఖలో టీడీపీ అధినేతపై ప్రశంసలు కురిపించిన యామిని.. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నానన్నారు. నాయకుడికి ఉండాల్సిన ఓర్పు, చాణక్యత, ప్రజల పట్ల అభిమానం.. ఇవన్నీ టీడీపీ అధినేత నుంచి నేర్చుకున్నానని.. తనను తాను నాయకురాలిగా మలుచుకున్నాననితన రాజీనామా లేఖలో పేర్కొన్నారు యామని.

ఇక, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను ప్రస్తావిస్తూ.. వ్యక్తిగత కారణాలతోపాటు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇతర బలమైన కారణాలతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. అయితే, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించిన యామిని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు.. అదే సమయంలో ఆమె పార్టీ వీడుతున్నారనే ప్రచారం సాగినా.. కొట్టిపారేసిన ఆమె.. ఇవాళ ఆమె టీడీపీకి బైబై చెప్పేశారు. అయితే, సాధినేని యామిని భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ నెల 10వ తేదీన బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో యామిని బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.