560 మంది చిన్నారులకు అండగా సచిన్... 

560 మంది చిన్నారులకు అండగా సచిన్... 

భారత జట్టులో దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. క్రికెటర్ గా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న సచిన్ క్రికెట్ ప్రపంచం లో ''క్రికెట్ గాడ్'' గా పేరు సంపాదించుకున్నాడు. కానీ అందులోనుండి తప్పుకున్న తర్వాత తన పనులతో క్రికెట్ లో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా తాను దేవుడని నిరూపించుకున్నాడు. తాజాగా ఎన్‌జీఓ సంస్థ అయిన పరివార్‌తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 చిన్నారులకు అండగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌ లోని సెహోర్‌ జిల్లాలోని సెవానియా, బీల్‌పాటి, ఖాపా ఇలా ఇతర మారుమూల గ్రామాల్లోని గిరిజన  పిల్లలు పోషకాహార లోపం, నిర్లక్ష్యరాస్యతతో ఇబ్బందులు పడుతుండటంతో సచిన్ టెండూల్కర్ ఈ‌ ఫౌండేషన్  ద్వారా ఆదుకుంటున్నాడు. ఆ చిన్నారులకు మధ్యాహ్మ భోజనం, ఉచిత విద్యను అందిస్తున్నాడు.