నెల్సన్ మండేలా ఓ మాట చెప్పాడు : సచిన్

నెల్సన్ మండేలా ఓ మాట చెప్పాడు : సచిన్

జాతి వివక్షతపై ఐసీసీ పోస్ట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ జాత్యహంకారానికి వ్యతిరేకంగా తన వైఖరిని ధృవీకరించడానికి 'క్రీడా శక్తి' గురించి నెల్సన్ మండేలా ఇచ్చిన సందేశాన్ని భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ అందరికి చెప్పారు. సచిన్ ట్విట్టర్లో... నెల్సన్ మండేలా ఒకసారి ఇలా అన్నారు, "ప్రపంచాన్ని మార్చగల శక్తి క్రీడకు ఉంది. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే శక్తి దీనికి ఉంది" అని ఆయన చెప్పిన మాటలను పోస్ట్ చేసాడు.

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణం భారీ నిరసనకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఒక్క వీడియోను విడుదల చేసింది. 2019 నుండి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ గెలిచిన చివరి క్షణాల క్లిప్‌ను ఐసీసీ పంచుకుంది, ఇందులో జోఫ్రా ఆర్చర్ అత్యంత నాటకీయమైన సూపర్ ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే అనేక మంది క్రీడా తారలు జాత్యహంకారానికి వ్యతిరేకంగా మాట్లాడారు.