ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే అంటున్న సచిన్...

ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే అంటున్న సచిన్...

ఐపీఎల్ 2020 ప్రారంభ సమయం దగ్గర పడినప్పటి నుండి ఇప్పుడు ప్రారంభమైన తర్వాత కూడా ఐపీఎల్ లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనే విషయాన్ని మాజీలు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఐపీఎల్ గెలవని జట్టు విజేతగా నిలిస్తుందని అలాగే ఐపీఎల్ లో విజయవంతమైన జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కనీసం ఫైనల్ కు కూడా రావని భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తెలిపాడు. సచిన్ మాట్లాడుతూ... ఈ ఏడాది కొత్త జట్టు ఐపీఎల్ 2020 విజేతగా నిలుస్తుందని చెప్పి ఫైనల్ కు ఏ జట్టు వెళ్తుందో చెప్పాడు. ఈ ఏడాది కోహ్లీ న్యాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ విజేతగా నిలుస్తుంది. కావాలంటే దీనిని రాసిపెట్టుకోండి అంటూ చెప్పాడు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది అని తెలిపాడు. అయితే తన సొంత జట్టు అయిన ముంబైని కాదని బెంగళూరు పేరు చెప్పడం ఏంటి అని అభిమానాలు ప్రశ్నించగా... ముంబై అంటే నాకు ఇష్టమే. కానీ ఈ ఏడాది బెంగళూరు గెలుస్తుంది అని నేను నాముతున్నాను అన్నాడు. అయితే సచిన్ మాటల తర్వాత ఆర్సీబీ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. ఇన్ని రోజులకు తమ జట్టు గెలవబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక జరిగిన గత 12 సీజన్లలో మూడు సార్లు ఫైనల్ కు వచ్చిన ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. చూడాలి మరి సచిన్ చెప్పిన మాటలను నిజం చేస్తూ ఈ ఏడాది అయిన ఆ జట్టు విజయం సాధిస్తుందా... లేదా అనేది.