2011 ఫైనల్ మ్యాచ్లో ధోనికి ఆ సలహా ఇచ్చింది సచిన్ ఏ అంట...!

2011 ఫైనల్ మ్యాచ్లో ధోనికి ఆ సలహా ఇచ్చింది సచిన్ ఏ అంట...!

ఏప్రిల్ 2, 2011 న భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కంటే ఎంఎస్ ధోనిని ముందు బ్యాటింగ్ కు వెళ్ళమని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్న సలహా ఇచ్చాడంట. తాజాగా ఇంటర్వ్యూలో టెండూల్కర్ మాట్లాడుతూ... భారత్  275 పరుగుల ఛేజింగ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ ధోనికి ముందు బ్యాటింగ్ కు వెళ్ళమని సందేశం ఇవ్వమని వీరేందర్ సెహ్వాగ్‌తో చెప్పానని పేర్కొన్నాడు. అప్పటికి గౌతమ్ మరియు విరాట్ మంచి భాగస్వామ్యం నెల కోల్పారు. అయితే కోహ్లీ అవుట్ అయిన తరువాత యువరాజ్ వెళ్ళాలి కానీ అక్కడ ఉన్న గంబీర్ అలాగే వెళాల్సిన యువరాజ్ ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్స్ అందువల్ల ధోని కుడిచేతి వాటం ఆటగాడు కాబట్టి తాను వెళ్తే ప్రత్యర్థి బౌలర్లను కొంచెం తికమక పెట్టవచ్చు. అయితే అప్పటివరకు యువి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు కాని శ్రీలంక జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారు, కాబట్టి వారికీ ఈ కుడి, ఎడమ ఆటగాళ్లు ఉంటె వ్యూహాత్మక మార్పు పని చేస్తుందని నేను అనుకున్నాను" అని టెండూల్కర్ తెలిపాడు. అయితే ఆ తరువాత  ఈ విషయం గురించి ఆలోచించి ధోని బ్యాటింగ్ స్థానం లో ముందుకు వచ్చాడు అని తెలిపాడు సచిన్. ఇక ఆ తరువాత ధోని ఆడిన ఆటను ఎవరు మర్చిపోలేరు.