21 రోజుల లాక్ డౌన్ పై లిటిల్ మాస్టర్, దాదా విజ్ఞప్తి...

21 రోజుల లాక్ డౌన్ పై లిటిల్ మాస్టర్, దాదా విజ్ఞప్తి...

కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యం లో భారత ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ విధించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి ప్రజలు ఎవరు బయటకు రాకూడదని వెల్లడించారు. అయితే ప్రజలు ఆ విషయాన్ని పట్టించుకోకుండ రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఈ విషయం పై అసంతృప్తి వ్యక్తం చేసాడు సచిన్. ఈ విషయం పైన సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసాడు. అందులో... నిన్ను ఈ 21 రోజులు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటాను. నిన్ను చేసింది మీరుకూడా చేయండి ఇంటి నుండి బయటకు రాకండి. ఈ కరోనా వైరస్ పై మనం అందరం కలిసికట్టుగా యుద్ధం చేస్తే తప్పకుండ విజయం సాధిస్తాము అని తెలిపాడు సచిన్. అంతక ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ప్రజలు కొన్ని సూచనలు చేసాడు. అందులో మనం ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన విషయాలను పాటిద్దాం.  అందుకే మనం అందరం స్వీయ గృహ నిర్బంధం కావాలి అని పిలుపునిచ్చారు. అయితే ఈ వైరస్ కారణంగా మన దేశం లో 13 మంది మరణించగా 693 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.