ఈ బామ్మలు గన్ను పడితే... టార్గెట్ ఫసక్కే ..

ఈ బామ్మలు గన్ను పడితే... టార్గెట్ ఫసక్కే ..

గన్ను ఎవరైనా పడతారు.. కొందరే టార్గెట్ ను కొడతారు.  ఆ కొందరే చరిత్రలో హీరోలుగా నిలుస్తారు.  లక్ష్యం ఒకటి అంటూ ఖచ్చితంగా ఉంటె.. ఎప్పటికైనా వారిదే విజయం అవుతుంది.  విజయానికి వయసుతో సంబంధం లేదు.  50 ఏళ్ల వయసులో అవసరం కోసం గన్ను పట్టుకున్న ఇద్దరు బామ్మలు ఆ గన్నుతోనే సంచలనాలు సృష్టిస్తారు.  వారి జీవితం ఆధారంగా బాలీవుడ్ లో సాండ్ కి ఆంఖ్ సినిమా తెరకెక్కింది.  

ఉత్తర ప్రదేశ్ లోని జోహ్రీ అనే గ్రామంలో చంద్ర తోమర్, ప్రకాశి తోమర్ అనే ఇద్దరు అక్కా చెల్లెల్లు ఉన్నారు.  ఇద్దరికీ చిన్నతనంలో వివాహం జరుగుతుంది.  వారి పిల్లలు చదువుకోడం బయటకు వెళ్లాల్సి వస్తుంది.  అల్లరి మూక నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు గన్ను పడతారు.  టార్గెట్ ను గురి తప్పకుండా కాల్చేందుకు ప్రాక్టీస్ చేస్తారు.  ఆ ప్రాక్టీస్ వాళ్లకు బాగా పనికొస్తుంది.  అనుకోకుండా వీళ్లకు జాతీయ స్థాయిలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం వస్తుంది. 

ఆ షూటింగ్ లో మంచి పెరఫార్మన్స్ ఇవ్వడంతో అనేక పోటీల్లో పాల్గొని వందలాది మెడల్స్ గెలుచుకుంటారు.  ఆ ఇద్దరి బామ్మలు యూపీతో పాటు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.  వీరి జీవితం ఆధారంగా వచ్చిన సాండ్ కి ఆంఖ్ మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.