సైలెంట్ గా సాహో దర్శకుని పెళ్లి...

సైలెంట్ గా సాహో దర్శకుని పెళ్లి...

రన్ రాజా రన్ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రలో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సుజీత్ ఆ తర్వాత ప్రభాస్ హీరో గా తీసిన సాహో సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 29 ఏళ్ళ ఈ యువ దర్శకుడు ఈ రోజు డాక్టర్ ప్రవల్లిక తో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సుజీత్ స్నేహితుడు మరియు సంగీత దర్శకుడు గిబ్రాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. కానీ సుజీత్ మాత్రం ఇప్పటివరకు కూడా తన పెళ్లి గురించి చెప్పలేదు. చాలా సైలెంట్ గా ఈ సాహో దర్శకుడు పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సుజీత్ మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోయే మలయాళం సూపర్ హిట్ సినిమా లూసీఫర్ కు తెలుగులో దర్శకత్వం వహించనున్నాడు. ఆ తర్వాత యువి క్రియేషన్స్‌తో కలిసి గోపీచంద్ హీరోగా మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.