ఆమె రీమేక్ లో సాహో బ్యూటీ శ్రద్దా...

ఆమె రీమేక్ లో సాహో బ్యూటీ శ్రద్దా...

బాహుబలి తర్వాత రెబల్  స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సాహో. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించి టాలీవుడ్ అభిమానులకు దగ్గరైంది. ఈ సినిమాలో గ్లామర్ తో పాటుగా యాక్షన్ సీన్స్‌లో కూడ అదరగొట్టింది. ఇదిలా ఉంటే అమలాపాల్ నటించిన `ఆమె` తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆడాయ్ పేరుతో తమిళంలోనూ బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్ అందరిని ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాను నిర్మించేది అలాగే దర్శకత్వం వహించేది ఎవరు అనే విషయం తెలియదు. కానీ ఇందులో అమల పాల్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటించనుందని సమాచారం. మరి శ్రద్దా ఈ బోల్డ్ రోల్ లో ఎలా నటిస్తుందో చూడాలి.