శ్రావణి ఆత్మహత్యతో నాకెలాంటి సంబంధం లేదు: అశోక్ రెడ్డి

  శ్రావణి ఆత్మహత్యతో నాకెలాంటి సంబంధం లేదు: అశోక్ రెడ్డి

సీరియల్ నటి ఆత్మహత్య కేసును విచారించిన పోలీసులు ఆర్ ఎక్స్100 దర్శకుడు అశోక్ రెడ్డిని ఏ2 నిందితుడిగా గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా పరారీలో ఉన్న దర్శకుడు ఈరోజు పోలిసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అశోక్ రెడ్డి మాత్రం తనకు శ్రావణి ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. అసలు తను శ్రావనితో ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడలేదని చెబుతున్నాడు. తానెప్పుడూ శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని అన్నాడు. జైలు నుండి భయటకు వచ్చాక అన్ని విషయాలు వివారిస్తానని అన్నారు. అనంతరం అశోక్ రెడ్డి ని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తరవాత ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకివెళ్లారు. కాగా అశోక్ రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టి ఆ తరవాత రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో పోలీసులు ఏ1 నిందితుడిగా సాయి కృష్ణారెడ్డిని, ఏ3 నిందితుడిగా దేవరాజ్ ను అరెస్ట్ చేశారు.