అత్యుత్సాహం తో ప్రాణాలపైకి తెచ్చుకున్న వెయిట్ లిఫ్టర్...

అత్యుత్సాహం తో ప్రాణాలపైకి తెచ్చుకున్న వెయిట్ లిఫ్టర్...

క్రీడాకారులు ఎప్పుడు ఓ కొత్త రికార్డు సృష్టించాలని అలాగే పోటీపడుతున్న ఆటలో గెలవడానికి చాలా చేస్తూ ఉంటారు. కానీ అందులో కొందరు అత్యుత్సాహం తో ప్రమాదం లో పడుతుంటారు. తాజాగా ఓ రష్యన్ వెయిట్ లిఫ్టర్ అలాంటి పనే చేసి తన ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లో ఈ ప్రమాదం జరిగింది. 400 కిలోల బరువును ఎత్తే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాస్కో వేదికగా జరిగిన ఈ‌ చాంపియన్‌షిప్‌లో అలెగ్జాండర్‌ సెడిఖ్‌ అనే క్రీడాకారుడు 400 కిలోల బరువును చాలా కష్టపడుతూ భుజాల వరకు ఎత్తి తట్టుకోలేక కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు అతను వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఈ ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు 6 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన అతని రెండు కాళ్ల ఎముకలను, కండరాలను అతికించారు. ఈ ప్రమాదంతో అతను తన కెరియర్ ను ముందుకు తీసుకెళ్లడం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే.. వెయిట్ లిఫ్టింగ్‌ లో పాల్గొనే క్రీడాకారులకు కాళ్ళు బలంగా  ఉండటం చాలా ముఖ్యం.