గుడ్ న్యూస్ చెప్పిన రష్యా: వచ్చే నెలలోనే  కరోనా వాక్సిన్ రిలీజ్...5 దేశాల్లో 17 కోట్ల డోస్ లు...

గుడ్ న్యూస్ చెప్పిన రష్యా: వచ్చే నెలలోనే  కరోనా వాక్సిన్ రిలీజ్...5 దేశాల్లో 17 కోట్ల డోస్ లు...

కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్  ను తయారు చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.  అమెరికా, రష్యా, బ్రిటన్ లు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి.  తాము ముందు వాక్సిన్ తయారు చేస్తామంటే తాము ముందు వాక్సిన్ ను రిలీజ్ చేస్తామని పోటీ పడుతున్నాయి.  అయితే రష్యా అందరి కంటే ముందు ఓ శుభవార్తను తీసుకొచ్చింది.  ఆ దేశానికి చెందిన సెచినోవ్ విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన వాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా   పూర్తి చేసినట్టు రష్యా ఆరోగ్యశాఖ ఈరోజు ప్రకటించింది.  వచ్చే నెలలో వాక్సిన్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  

మొదటి విడతగా రష్యాలో మూడు కోట్ల డోస్ లను తయారు చేస్తున్నట్టు తెలిపారు.  ఇక ప్రపంచంలోని ఐదు దేశాలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేయడానికి అంగీకరించాయని, ఆయా దేశాల్లో కలిపి మొత్తం 17 కోట్ల డోస్ లు తయారు చేయబోతున్నట్టు రష్యా ప్రకటించింది.   అయితే,  ఈ వాక్సిన్ ఖరీదు ఎంత ఏంటి అనే విషయాలను ప్రకటించాల్సి ఉన్నది.  ఏ ఏ దేశాల్లో ఆ వాక్సిన్ ను తయారు చేయబోతున్నారో రష్యా ఇంకా ప్రకటించలేదు.  అటు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం డెవలప్ చేస్తున్న వాక్సిన్ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తామని అంటోంది.  దీంతో ప్రపంచంలో మొదటి కరోనా వాక్సిన్ రష్యా నుంచి రాబోతున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.