ఆగష్టు 12 న రష్యా వాక్సిన్...!!  

ఆగష్టు 12 న రష్యా వాక్సిన్...!!  

కరోనా వాక్సిన్ విషయంలో రష్యా దూకుడును ప్రదర్శిస్తోంది.  చెప్పినట్టుగానే ఆగష్టు మొదటివారంలో వాక్సిన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.  ఆగస్టు 12 వ తేదీన ఈ వాక్సిన్ ను రిజిస్టర్ చేయించబోతున్నారు.  వాక్సిన్ రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే మొదట దేశంలోని 1600 మంది వైద్యులు, ఆరోగ్యసిబ్బంది, ముసలివారికి అందజేస్తారు.  ఆ తరువాత దేశంలోని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.  

అయితే, రష్యా వాక్సిన్  పై  అందరిలోనూ అనేక అనుమానాలు ఉన్నాయి.  రష్యా వాక్సిన్ ను సరిగా ట్రయల్స్ నిర్వహించకుండా హడావుడిగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి.  కానీ, రష్యా మాత్రం వాటి గురించి పట్టించుకోవడం లేదు.  తాము అన్ని విధాలుగా కరెక్ట్ గా చేస్తున్నామని, వాక్సిన్  తప్పకుండా సక్సెస్ అవుతుందని రష్యా ఆరోగ్యశాఖ చెప్తోంది.  రష్యా రిలీజ్ చేసే వాక్సిన్ సక్సెస్ అయితే, అమెరికా కూడా సెప్టెంబర్ లేదా నవంబర్ నాటికి వాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు  అవకాశం ఉంటుంది.