పతనంలో చరిత్ర సృష్టించిన రూపాయి

పతనంలో చరిత్ర సృష్టించిన రూపాయి

రూపాయి పతనానికి అడ్డు వేసేవారే లేరా అన్నట్లు ఉంది ఫారెక్స్ మార్కెట్‌ పరిస్థితి. రూపాయి పతనం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రూపాయి  పతనంలో కొత్త రికార్డు సృష్టించింది. ఇవాళ స్పాట్‌ మార్కెట్ డాలర్ తో రూపాయి  విలువ 72ను దాటి పోయింది. డాలర్ తో రూపాయి విలువ ఒక దశలో 72.10కి చేరడంతో దిగమతిదారులు గగ్గోల పెడుతున్నారు. నిన్న ,మొన్న రూపాయి పతనం ఒక మోస్తరుగా ఉండటంతో దిగుమతిదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇవాళ మిడ్ సెషన్ సమయానికి అర శాతంపైగా పడిపోవడంతో.. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది.