అమెరికా మూన్ మిషన్ విజయవంతం కావడానికి ఇదే కారణం?

అమెరికా మూన్ మిషన్ విజయవంతం కావడానికి ఇదే కారణం?

అమెరికా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ మూన్ కార్యక్రమం దాదాపు 38సార్లు ఫెయిల్ అయ్యింది.  ఎట్టకేలకు 39 వ సారి విజయవంతంగా ప్రయోగించారు.  అమెరికా మిషన్ మూన్ విజయవంతం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంభాజీ బీడే వెల్లడించారు.  అమెరికా మిషన్ మూన్ కోసం దాదాపు 38సార్లు ప్రయత్నం  చేసి విఫలం అయ్యింది.  ఆ తరువాత ఇండియన్ గణాంకాలను ఆధారం చేసుకొని ఏకాదశి రోజున మిషన్ మూన్ లోని 39 ఆ ప్రయోగం చేసింది.  

ఏకాదశి రోజున ప్రయోగం చేపట్టింది కాబట్టి ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు బీడే పేర్కొన్నారు.  చంద్రయాన్ 2 విషయంలో కూడా ఇలా చేసి ఉంటె బాగుండేదని అన్నారు. గతంలో ఈయన తన మామిడి తోటలోని మామిడిపండ్లను తింటే మగపిల్లలు పుడతారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.