ముస్లింల కోసం ఆర్ఎస్ఎస్ హెల్ప్ సెంటర్..
లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది.. ఆ వెంటనే హైదరాబాద్లో ముస్లింల కోసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఆర్ఎస్ఎస్... ఆర్ఎస్ఎస్కు చెందిన ముస్లిం రాష్ట్రీయ్ మంచ్ (ఎంఆర్ఎం).. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ముస్లిం మహిళల కోసం సలహా కేంద్రాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ముస్లిం కుటుంబాల కోసం ఎంఆర్ఎం ప్రారంభించిన తొలి కేంద్రం కూడా ఇదే. శుక్రవారం సమూహిక ప్రార్థనల తర్వాత ఓల్డ్ సిటీ అఫ్జల్గంజ్లోని తన కార్యాలయంలో వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఎంఆర్ఎం ప్రారంభించింది. ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ ఇలాకాలో ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఎంఆర్ఎం మహిళా విభాగం జాతీయ కన్వీనర్ రేష్మా హుస్సేన్ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ఆర్ఎస్ఎస్.. ముస్లిం మహిళల కోసం ఏర్పాటు చేసి తొలి కౌన్సెలింగ్ కేంద్రం ఇదే. ప్రస్తుతానికి రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లో ఈ కేంద్రాలు ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)