కరోనా ఎఫెక్ట్... ఆర్ఎస్ఎస్ సమావేశాలు రద్దు

కరోనా ఎఫెక్ట్... ఆర్ఎస్ఎస్ సమావేశాలు రద్దు

కరోనా వైరస్ ఇప్పుడు అన్ని దేశాలను వణికిస్తోంది.. అధికారిక పర్యటనలు, కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నారు నేతలు. మరోవైపు... భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో, అప్రమత్తమైన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు, పార్క్‌లు.. ఇలా అన్ని మూసివేస్తున్నాయి. ఇక, ఆర్ఎస్ఎస్ సమావేశాలను సైతం తాకింది కరోనా ఎఫెక్ట్.. కరోన వ్యాపిస్తున్న నేపథ్యంలో.. బెంగళూరులో జరగాల్సిన ఆర్ఎస్ఎస్ అఖిలభారతీయ ప్రతినిధుల సమావేశాలను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం.. ఆర్ఎస్ఎస్ సమావేశాలు.. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయక మండలి వివిధ క్షేత్రాల ముఖ్య ప్రతినిధులతో పాటు.. 1400 మంది ప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో మొత్తానికి సమావేశాను రద్దు చేసింది ఆర్ఎస్ఎస్.