ఆదిలాబాద్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటన

ఆదిలాబాద్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటన

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలంగాణ పర్యటనలో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారని సంఘ్ నాయకులు వెల్లడించారు. ఈరోజు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ గుడిహత్నూర్ మండలం లింగాపూర్‌లో సేంద్రీయ  రైతు కుటుంబాల సమ్మేళనంలో పాల్గొననున్నారు. మరికాసేపట్లో ఆయన జిల్లాకు రానున్నారు. గత రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భగవత్ బస చేశారు.