రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారంటే..!!

రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారంటే..!!

దేశంలో రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికి గందరగోళం నెలకొని ఉన్నది.  అనేకమంది ఈ రిజర్వేషన్ల విషయంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్తూనే ఉన్నారు.  ప్రభుత్వాలు వాటికి తోచింది చేసుకుంటూ పోతూనే ఉన్నాయి.  గతంలో రిజర్వేషన్లను పునసమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.  పెద్ద దుమారం చెలరేగింది.  ఆ తరువాత అయన వీటిపై వ్యాఖ్యలు చేయలేదు.  

కాగా, తాజాగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ చిఎఫ్ మరోమారు మాట్లాడారు.  రిజర్వేషన్లపై శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని అభిలషించారు. తాను గతంలో కూడా దీనిపై చర్చను లేవనెత్తానని... కానీ, అది పూర్తిగా పక్కదోవ పట్టిందని వాపోయారు. రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకిస్తున్న వారి భావాలను అర్థం చేసుకోవాలని, అలాగే వాటిని వ్యతిరేకిస్తున్న వాళ్లు అనుకూలంగా ఉన్న వారి ప్రయోజనాలను కూడా ఆలోచించాలని సూచించారు. ఎప్పుడు తాను రిజర్వేషన్లపై మాట్లాడినా.. సమాజంలోని వివిధ వర్గాల నుంచి స్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. దీంతో అయన వీటిపై పెద్దగా మాట్లాడటం లేదని తెలుస్తోంది.