ఆర్ఆర్ఆర్ స్పెషల్ అప్డేట్ వచ్చేది అప్పుడే..?
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్కూడా ఒకటి. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా హిందీ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ అప్డేట్ మార్చి15న రిలీజ్ కానుందంట. ఇప్పటికే సినిమాలోని హీరోల టీజర్లు రిలజ్ అయిపోయాయి. సినిమాలో నటించనున్న విదేశీ నటుల పోస్టర్లు కూడా వచ్చేశాయి. ఇక ఈ సారి మిగిలింది ఒకే ఒక్కరు. ఆర్ఆర్ఆర్ సినిమా అల్లూరి సీతారామరాజు జోడీ అయిన సీత పాత్రను పరిచయం చేయాలని, బహుశా ఈ అప్డేట్ సీత గురించేనేమో. ఈ పాత్రలో బీటౌన్ బ్యూటీ అలియా భట్ నటించారు. మార్చి 15న అలియా పుట్టినరోజు సందర్భంగా సీత పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. వీటిలో నిజం ఎంతవరకు ఉందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)