ఆర్ఆర్ఆర్‌కు తప్పని లీకుల బెడద..

ఆర్ఆర్ఆర్‌కు తప్పని లీకుల బెడద..

టాలీవుడ్‌లో భారీ సినిమాలు సైతం లీకుల నుంచి తప్పించుకోలేక పోతున్నాయి. ఇప్పటికే  అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లొకేషన్స్ నుంచి అనేక ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు తెలుగులో భారీ తెరకెక్కుతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో కొమరం భీమ్ పాత్రలో ఎన్‌టీఆర్ సంకెళ్లు తెంచుకుంటూ కనిపిస్తున్నారు. మరో ఫోటోలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ బ్రిటీష్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. ఈ సినిమా విషయంలో జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం లేక పోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతోంది. రెండు నిజమైన పాత్రల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, రే స్టీవెన్ సన్, సముద్రఖని, అలిసన్ డూడి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.