ఆర్ఆర్ఆర్‌కి రికార్డు స్థాయి ఆఫర్..?

ఆర్ఆర్ఆర్‌కి రికార్డు స్థాయి ఆఫర్..?

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్‌టీర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా తారాస్థాయి అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్‌లు, టీజర్‌లు అన్నీ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ వార్త ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కుల గురించి. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు స్టార్ నెట్వర్క్స్ వారు సిద్దమయ్యారంట. అది కూడా దాదాపు రూ.200 కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్టార్ వాళ్లకి ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌కు ఉన్న వారిలో సగం కూడా యూజర్స్ ఉండరని, కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులకు ఇంకా ధర పలికే అవకాశాలు ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇప్పటి వరకు ఓటీటీ హక్కులకు భారీ మొత్తం వసూళ్లు చేసిన మొట్టమొదటి భారత సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టిస్తుంది. మరి ఈ వార్త పై క్లారిటీ కోసం ఎదురు చూడాల్సిందే.