కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ విక్టరీ... పంజాబ్‌ దూకుడుకు బ్రేక్‌..!

కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ విక్టరీ... పంజాబ్‌ దూకుడుకు బ్రేక్‌..!

పంజాబ్‌కు గట్టి షాకిచ్చింది రాజస్థాన్‌. వరుస విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్‌ కింగ్స్‌కు అడ్డుకట్ట వేసింది. కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించింది.. వరుసగా ఐదు విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్‌కు బ్రేక్ వేసింది రాజస్థాన్‌. బెన్‌ స్టోక్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌, సంజూ శాంసన్‌ దూకుడుకు ఉతప్ప తోడవ్వడంతో... అలవోకగా విక్టరీ సాధించింది రాజస్థాన్ రాయల్స్‌. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌... 4 వికెట్లు కోల్పోయి 185 రన్స్ చేసింది. గేల్‌ మరోసారి దుమ్ములేపాడు. 63 బంతుల్లో 99రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్‌ కూడా 46 పరుగులతో  రాణించాడు. పూరన్‌ ఫర్వాలేదనిపించాడు. దీంతో రాజస్థాన్‌కు ముందు మంచి టార్గెట్‌ పెట్టింది.

ఇక, పంజాబ్ నిర్దేశించిన టార్గెట్‌ను 17 ఓవర్లలోనే చేధించింది రాజస్థాన్‌. బెన్‌ స్టోక్స్‌ 26 బంతుల్లో 50 పరుగుల చేయగా... శాంసన్‌ 25 బంతుల్లో 48 పరుగులు చేశాడు. రాబిన్‌ ఉతప్ప 23 బంతుల్లో 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్‌ స్మిత్‌, బట్లర్‌ రాణించడంతో... 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా పంజాబ్‌కు ప్లే ఆఫ్ ఆశలు పదిలంగానే ఉన్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో విజయం సాధించాలి. అంతేకాదు రన్‌ రేటు కూడా మెరుగ్గా ఉండాలి. అప్పుడే ప్లే ఆఫ్‌ చేరుకుంటుంది.