ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ...

ఐపీఎల్ 2020 లో ఆరో మ్యాచ్ ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే కోహ్లీకి మ్యాచ్ గెలవడం కంటే టాస్ గెలవడమే చాలా కష్టం అనే విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది ఐపీఎల్ లో వరుసగా టాస్ ఓడిపోయిన కోహ్లీ అది గెలవడానికి ప్రాక్టీస్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇక మరి ఈ రోజు టాస్ గెలిచిన కోహ్లీ మ్యాచ్ కూడా గెలుస్తాడా అనేది చూడాలి. ఇక అంపైర్ తప్పిదం వల్ల గత మ్యాచ్ ఓడిపోయిన పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. మరి ఈ రోజు ఏ జట్టు గెలుస్తుంది అనేది చూడాలి.

బెంగళూర్ జట్టు : దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్, శివం దుబే, జోష్ ఫిలిప్ (wk), వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, ఉమేష్ యాదవ్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ జట్టు : లోకేష్ రాహుల్ (wk/c), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నీషామ్, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్