ఐపీఎల్ 2021 : బెంగళూరు ఖాతాలో వరుసగా నాలుగో విజయం 

ఐపీఎల్ 2021 : బెంగళూరు ఖాతాలో వరుసగా నాలుగో విజయం 

ఐపీఎల్ 2021 లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కు బెంగళూరు  బౌలర్లు షాక్ ఇచ్చారు. కానీ తర్వాత శివం దుబే(46) రాహుల్ తెవాటియా(40) తో అదరగొట్టడంతో రాజస్థాన్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇక 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన బెంగళూరు ఓపెనర్లు రాణించారు. ఆర్సీబీ యువ ఓపెనర్ దేవదత్ పాడికల్ (101) సెంచరీతో దుమ్మురేపగా కెప్టెన్ కోహ్లీ(72) అర్ధశతకం సాధించాడు. దాంతో బెంగళూరు 16.3 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోకుండా ఐపీఎల్ 2021 లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది కోహ్లీ సేన. ఇక ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మొదటిస్థానానికి చేరుకుంది.