ఐపీఎల్ 2020: కోల్ కతాపై బెంగళూరు విజయం 

ఐపీఎల్ 2020: కోల్ కతాపై బెంగళూరు విజయం 

ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.  అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘనవిజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది.  బెంగళూరు జట్టులోని బౌలర్లు రాణించడంతో కోల్ కతా ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కే ముగిసింది.  కోల్ కతా జట్టులో మోర్గాన్ మినహా మరెవ్వరూ రాణించలేదు.  85 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కేవలం 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.  ఓపెనర్లు దేవదత్, ఆరోన్ ఫించ్ లు దూకుడుగా ఆడటంతో తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.  దేవదత్ 25, ఫించ్ 16 పరుగులు చేయగా, గుర్మీత్ సింగ్ 21, విరాట్ కోహ్లీ 18 పరుగులు చేశారు.  ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ లో నిలిచింది