ఐపీఎల్ 2020 : రాణించిన స్మిత్... ఆర్సీబీ లక్ష్యం...?

ఐపీఎల్ 2020 : రాణించిన స్మిత్... ఆర్సీబీ లక్ష్యం...?

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ ఓపెనర్లను బెంగళూర్ బౌలర్లు ముందుగా ఒత్తిడికి గురిచేసిన ఆ తర్వాత రాబిన్ ఉతప్ప 22 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్ తో మొత్తం 41 పరుగులు చేసి ఒత్తిడిని తగ్గించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ స్మిత్ 36 బంతుల్లో 57 పరుగులతో అర్ధశతకం పురుగు చేసి ఔట్ అయ్యాడు. కానీ చివర్లో ఆర్చర్ బ్యాట్ తో మెరుపులు మెరిపించకపోవడంతో రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇక బెంగళూర్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లు సాధించగా యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఆర్సీబీ 178 పరుగులు చేయాలి. అయితే బెంగళూర్ జట్టులో ప్రస్తుతం కోహ్లీ, డివిలియర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. మరి వారి ఫామ్ కి రాయల్స్ బ్రేక్ వేసి ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందా... లేదా అనేది చూడాలి.