ఐపీఎల్ 2020: హైదరాబాద్ బౌలర్ల విజృంభణ...తక్కువ స్కోర్ కే ఆర్సీబి కట్టడి...

ఐపీఎల్ 2020: హైదరాబాద్ బౌలర్ల విజృంభణ...తక్కువ స్కోర్ కే ఆర్సీబి కట్టడి...

ఐపీఎల్ 2020లో 52 వ మ్యాచ్ ఈరోజు షార్జాలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమని చెప్పొచ్చు.  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కేవలం 120 పరుగులకే కట్టడి చేసింది.  రాయల్ ఛాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.  ఓపెనర్ ఫిలిప్పి, డివిల్లర్స్, వాషింగ్టన్ సుందర్ మినహా ఎవరూ రాలించలేదు. సందీప్ శర్మ, హోల్డర్ లు రెండు వికెట్లు తీసుకోగా, నటరాజన్, నదీమ్, రషీద్ ఖాన్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.