ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్... 

ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్... 

ఐపీఎల్ 2021 లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ తీసుకోవడంతో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఐపీఎల్ 2021 లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన కోహ్లీ సేన అదే జోరును కొనసాగించాలని చూస్తుంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఈ ఐపీఎల్ లో తమ రెండో విజయాన్ని నమోదు చేయాలనీ రాజస్థాన్ చూస్తుంది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్ లో గెలిస్తే మొదటి స్థానానికి వెళ్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

రాజస్థాన్ : జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు సామ్సన్ (w/c), శివం దుబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, కైల్ జామిసన్, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్