టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ
మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కోహ్లీ. ఐపీఎల్-11లో వాంఖడే స్టేడియం వేదికగా రెండు పెద్ద జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు వెనుకబడిన విషయం తెలిసిందే. వరుసగా మూడు పరాజయాలు చవిచూసింది ముంబయి ఇండియన్స్. ఇక మూడింటిలో కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ క్రమంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇరు జట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రెండన్ మెక్‌కలమ్, ఖేజ్రోలియా, పవన్ నేగి స్థానంలో మహ్మద్ సిరాజ్, కోరె ఆండర్సన్, సర్ఫరాజ్ ఖాన్ లను తుది జట్టులోకి తీసుకుంది ఆర్‌సీబీ. మరోవైపు స్పిన్నర్ ధనంజయ స్థానంలో మెక్లెనగన్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై. ఒకవైపు టీమిండియా కెప్టెన్.. మరోవైపు వైస్ కెప్టెన్ లు ఇరు జట్లకు నాయకత్వం వహిస్తుండటంతో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. రెండు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉన్నాయి.