ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన: దేశంలో మూడు కోట్ల మంది కరోనా బాధితులు...  

ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన: దేశంలో మూడు కోట్ల మంది కరోనా బాధితులు...  

గల్ఫ్ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.  ముఖ్యంగా ఇరాన్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యలో కొన్ని రోజులు కేసులు తగ్గినట్టే కనిపించినా ఆ తరువాత మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి.  ప్రస్తుతం ఆ దేశంలో 2.71 లక్షల కేసులు ఉన్నాయి.  14వేల మరణాలు సంభవించాయి.  అయితే, గత కొన్ని రోజులుగా కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు రుహాని ఓ సంచలన ప్రకటన చేశాడు.  

ప్రస్తుతం దేశంలో రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సంక్రమించి ఉండొచ్చని అన్నారు.  రాబోయే మూడు నెలల కాలంలో ఇది మూడు కోట్లకు చేరే అవకాశం ఉన్నట్టుగా అయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం బాగాలేదంటూ అయన చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. అయితే,  వేటి ఆధారంగా ఇరాన్ ప్రభుత్వం ఈ లెక్కలు వేసిందో బయటపెట్టలేదు.  అధ్యక్షుడే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   8.18 కోట్ల మంది నివశించే  ఇరాన్ లాంటి చిన్న దేశంలో  2.5 కోట్లమంది కరోనా బారిన పడ్డారంటే అది సామాన్యమైన విషయం కాదు.  ఆ దేశంలో మహమ్మారి తీవ్రత ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.