నగరి వైసీపీలో వర్గపోరు.. రోజా స్టాంగ్ వార్నింగ్
పంచాయతీ ఎన్నికలు నగరి వైసీపీలో వర్గపోరును బహిర్గతం చేశాయి.దీంతో ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహించే నగరి నియోజకవర్గంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని సస్సెండ్ చేశారు రోజా. ఇంకోసారి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు..అలాంటి వారిని ఎరివేస్తానని స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు రోజా. తడుకుకు చెందిన ముప్పాళ్ల రవి శేఖర్ రాజా, వై. బొజ్జయ్య పార్టీ నుంచి తొలగించింది. కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తొర్రురు పంచాయతీకి చెందిన యం.కిషోర్ కుమార్, గుండ్రాజు కుప్పం హరిజన వాడకు చెందిన రాజాపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ అభ్యర్థులను ఓడించాలని ప్రయత్నించినవారిని సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే రోజానే స్వయంగా తెలిపారు. వారు ఇక వైఎస్సార్సీపీ జెండా, గుర్తులును కూడా పట్టుకోవడానికి వీల్లేదన్నారు. పార్టీ తరపున పనిచేయడానికి వీల్లేదన్నారు. ఎమ్మెల్యే రోజాతో పాటూ స్థానిక పార్టీ నేతల ఫిర్యాదుతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వైఎస్సార్సీపీలో ఈ పరిణామాలు జరిగాయి.ఎన్నికల నామినేషన్లు అప్పుడే రెబల్స్ తీవ్ర స్ధాయిలో రోజాను ఇబ్బంది పెట్టారు. మున్సిపల్ ఎన్నికలలో అవకాశం ఇస్తానని చెప్పినా కొందరు నేతలు ఏమాత్రం వినకుండా రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగారు..
దీనివల్ల అక్కడ టిడిపి గెలిచే అవకాశం వచ్చిందని సమాచారం.. నగరి నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ 74 గెలిచింది. అయితే ఎన్నికలలో తన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి రోడ్డెక్కి చెమటోడ్చారు రోజా. టిడిపి ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాష్ మాత్రం ప్రచారం చేయకుండానే 20వరకు సీట్లు గెలిపించుకోవడం సోంత పార్టీ కేడర్ మింగుడు పడని అంశంగా మారిందట. టిడిపి గెలుపుకి ఒకరకంగా ఈ రెబల్స్ పోటీ వల్లే కారణంగా భావిస్తున్న రోజా ఎన్నికల ఫలితాల వరకు వేచి చూసి ఇప్పుడు వారిపై వేటు వేశారని టాక్ నడుస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)