ధోనితో పోల్చడం పై రోహిత్ స్పందన... 

ధోనితో పోల్చడం పై రోహిత్ స్పందన... 

రోహిత్ శర్మ భారత క్రికెట్‌లో తదుపరి ఎంఎస్ ధోని అని అతడినే అందరూ కెప్టెన్‌గా భావిస్తున్నారని భారత బాట్స్మెన్ సురేష్ రైనా ఇంతకముందు తెలిపారు. యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడంలో అలాగే డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల అందరి మాటలు వినడంలో ఈ ఇద్దరు కెప్టెన్లు ముందుంటారు. ఇక ధోని, రోహిత్ శర్మ ఇద్దరూ ఒకేలాంటి సామర్ధ్యాలను కలిగి ఉన్నందున, వారు నా పుస్తకంలో అద్భుతమైన కెప్టెన్లు అని సురేష్ రైనా అన్నారు. ఇక తాజాగా రైనా వ్యాఖ్యల పై ఇంస్టాగ్రామ్ వేదికగా హిట్ మ్యాన్ స్పందించాడు. ధోనితో పోల్చడం పై రోహిత్ మాట్లాడుతూ... ''అవును నేను రైనా చెప్పిన మాటలు విన్నాను. ధోని వంటి ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ఆయనతో నన్ను పోల్చడం సరికాదు. నేనైతే అసలు ఎవరితో పోల్చడం వద్దు అనే అంటాను. ఎందుకంటే ఏ ఆటగాడికి ఉండాల్సిన సామర్ధ్యం ఆ ఆటగాడికి ఉంటుంది. అలాగే కెప్టెన్ లకు కూడా తమ తమ ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒకరు భిన్నమే'' అని రోహిత్ అన్నాడు. అయితే  రోహిత్ ను ధోనితో కేవలం రైనా మాత్రమే కాకుండా ఇంతకముందు కూడా చాలా మంది మాజీ ఆటగాళ్లు కూడా పోల్చారు.