ముంబై ఇండియన్స్ కొత్త ఫ్యాన్ ఎవరో తెలుసా?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టు ఏదంటే వెంటనే గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్‌కింగ్స్. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మైదానంలో చెన్నై ఆడే మ్యాచ్ లలో ధోని సందడి ఉంటుంది. మరోవైపు ధోనీ భార్య సాక్షి, కూతురు జీవాలు కూడా స్టేడియంలో సందడి చేస్తారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఫైనల్లో చెన్నై గెలిచిన అనంతరం ధోనీ, జీవా సరదాగా గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఆడుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలను చెన్నై జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో కూడా వైరల్ అయింది.
తాజాగా భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఓ వీడియోను పోస్ట్ చేసాడు. జీవా ముంబయి ఇండియన్స్ అభిమాని అని వెల్లడించాడు. దీనికి సంబంధించి జీవాతో కలిసి ఉన్న వీడియోను రోహిత్ తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ' ముంబయి ఇండియన్స్ ఫ్యామిలీలోకి కొత్త అభిమాని వచ్చింది' అని కాప్షన్ పెట్టాడు. ఎంఎస్ ధోని, సాక్షి ఎస్ రావత్ అని టాగ్స్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
We have a new @mipaltan fan in the house yo!! @msdhoni @SaakshiSRawat pic.twitter.com/yasd7p6gHj
— Rohit Sharma (@ImRo45) July 21, 2018
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)