రోహిత్ కు పంజాబ్ మ్యాచ్ లో గాయం... అందుకే చెన్నై మ్యాచ్ కు దూరం..

రోహిత్ కు పంజాబ్ మ్యాచ్ లో గాయం... అందుకే చెన్నై మ్యాచ్ కు దూరం..

ఐపీఎల్ లో గత ఆదివారం ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అందరికి గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ లో విజేత ఎవరో తెలుసుకోవడానికి రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎట్టకేలకు పంజాబ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత అవార్డు సెర్మనీకి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రాలేదు. అతను ఎందుకు రాలేదు అనేదానిపై చాలా ఊహాగానాలే వచ్చాయి. కానీ ఆ జట్టు నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ లో కూడా రోహిత్ లేడు. దాంతో పోలార్డ్ జట్టుకు న్యాయకత్వం వహించాడు. కానీ ఈ మ్యాచ్ సమయంలోనే రోహిత్ శర్మ గాయం కారణంగానే ఆడటం లేదు అని తెలిసింది. అయితే లాక్ డౌన్ కు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్‌ పర్యటనలో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఆడుతున్న చివరి మ్యాచ్ లో మోకాలి గాయం కారణంగా రోహిత్ ఆ పర్యటనకు దూరమయ్యాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ గాయం కారణంగానే రోహిత్ చెన్నై మ్యాచ్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే కెప్టెన్ లేకపోయినా చెన్నై పై ముంబై 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది.