హిట్ మ్యాన్ బాదితే బాల్ బస్సుపై...

హిట్ మ్యాన్ బాదితే బాల్ బస్సుపై...

2007 లో ఐర్లాండ్ పై భారత జట్టులోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. అలాగే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు న్యాయకత్వం వహిస్తూ ఇప్పటికి నాలుగుసార్లు ఆ జట్టును విజేతలుగా నిలిపాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా యూఏఈ లో జరగనుండటంతో జట్టుతో అక్కడికి వెళ్లిన రోహిత్ ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత తన శిక్షణ ఆరంభించాడు. అయితే రోహిత్ శర్మ సిక్స్ లకు పెట్టింది పేరు. అందుకే అతడిని అందరూ హిట్ మ్యాన్ అని పిలుస్తారు. ఇక ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయం లో హిట్ మ్యాన్ బాదితే బాల్ వెళ్లి స్టేడియం బయట వెళ్తున్న బస్సుపై పడింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ముంబై ఇండియన్స్ దానికి '' బాట్స్మెన్స్ సిక్స్ కొడతారు. లెజెండ్స్ బంతిని స్టేడియం బయటికి పంపిస్తారు. కానీ హిట్ మ్యాన్ తన సిక్స్ తో బంతిని స్టేడియం బయట వెళ్తున్న బస్ కు తాకేలా కొడతాడు'' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 సిరీస్ లో గాయపడ్డ రోహిత్ మళ్ళీ ఇప్పటివరకు క్రికెట్ ఆడలేదు. కానీ ఐపీఎల్ ప్రారంభం కానున్న 19న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై రోహిత్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.